Sunday, January 26, 2014

Thursday, January 23, 2014

మహా నటునికి మౌన నివాళి

అక్కినేని నాగేశ్వర రావుగారు తుది శ్వాస వదిలి అప్పుడే ఒక రోజు గడిచిపోయింది... నేను అమితంగా అభిమానించే మహా నటుడు అక్కినేని. అయన అస్తమించారన్న విషయం నిన్న ఉదయం మా మేనల్లుడు జాగింగ్ నుంచి తిరిగి రాగానే చెప్పాడు... వెంటనే మా ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి ఛానల్ ఆన్ చేశాను... ఈ లోగా నా  స్నేహితుడు ఒకాయన వచ్చి చానెల్ చూసి అరె అక్కినేని పోయారా అని దిగ్భ్రాంతి చెందారు... పక్కనే ఉన్న నా శ్రీమతి ఆయన పోయారు సరే... మా అయన ఏమవుతారో అనే నా బెంగ అంది... అలా అని తనకి బాధ లేదని కాదు... తను కూడా అయన అభిమానే... మా వివాహానికి ముందు మాటేమో గాని నాతో అనుబంధం ఏర్పడిన తర్వాత మాత్రం తను ఏఎన్నార్ అభిమానే...ఇది వేరే విషయం... ఒక సగటు గృహిణిగా ఆమె బాధ అది...ఆమెకు బదులిస్తూ పిచ్చిదానా...నాగేశ్వర రావుగారు అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం మనకి తెలిసిందే కదా... అంత భయపడాల్సిందేముంది అన్నాను...కాని ఆ తర్వాతే తెలిసింది ఆ వార్త ఎంత కలచి వేసిందో...ఎంత సేపటికి ఏ పని చేయలేక పోయాను...చాలా  సేపు టీవీ చూస్తూనే గడిపాను...మధ్యానం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటె దానికి అటెండ్ అయి నా మిత్రుడు అమర్ తో కలిసి అక్కినేని భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించాను...
చిన్న తనం నుండి నా ఆరాధ్య నటుడు ఆయన...1970 దశకంలో దసరాబుల్లోడు సినిమా చుసిన తర్వాత నేను ఆయన అభిమానిని అయ్యాను...అంతకు ముందు కూడా చిన్న తనంలో డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం, ఆత్మబలం, మంచి మనసులు, మూగ మనసులు వంటి సినిమాల్లోని పాటలు మా ఇంటి పక్కనే ఉన్న హోటల్ లో వింటుంటే ఏదో అలౌకిక ఆనందానికి లోనయ్యే వాడిని... దసరా బుల్లోడు చుసిన నాటికి నేను చూసిన సినిమాలు కూడా చాలా తక్కువే... దసరా బుల్లోడు చుసిన తర్వాత నాలో తెలియకుండానే ఒక సంకల్పం కలిగింది...ఏఎన్నార్ సినిమాలు ఎన్ని వీలయితే అన్ని చూడాలని...ఆ తర్వాత చదువు, ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా ఏ వూరు వెళ్ళినా ఏఎన్నార్ పాత సినిమాలు ఆడుతుంటే చూడకుండా కదిలే వాడిని కాదు... ఆయన నటించిన 200 వ సినిమా మేఘ సందేశం విడుదల అయిన సందర్భంగా కొన్ని పత్రికల్లో ఏఎన్నార్ సినిమాల జాబితా ప్రచురించారు... అప్పుడు చుస్తే తెలిసింది అప్పటికి నేను 200 సినిమాల్లో 130 వరకు చూశానని...పది సంవత్సరాల కాలంలో చదువుతో పాటుగా ఏఎన్నార్ అభిమానిగా నా రికార్డు అది... ఆ తర్వాత పాత్రికేయ వృత్తిలో భాగంగా ఎన్నో సార్లు ఆయన్ని దగ్గర నుంచి చూశాను... అక్కినేని గారిని కలిసే భాగ్యం అంటూ కలిగితే ఆయనతో ఒక సారైనా మాట్లాడాలన్న తపన నాలో ఉండేది... కానీ నిజంగా ఆయనని కలిసినప్పుడు మౌనమే నా భాష అయింది...ఎప్పుడూ ఆయనతో నోరు విప్పి మాట్లాడలేక పోయాను...ఫ్యూజి ఫిల్మ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు మాత్రం ఉద్యోగ ధర్మంలో భాగంగా ఒకే ఒక్క ప్రశ్న వేశాను...నడిచే విశ్వవిద్యాలయంగా పేరు పొందిన అయన అంటే నాకు గల గౌరవమే నన్ను అంత మూగ వాడిని చేసిందేమో... ఇప్పుడు నా అభిమాన నటుడికి ఒక కన్నీరు వదలడమే నా నివాళి...

దామరాజు వెంకటేశ్వర్లు

Wednesday, January 22, 2014

MY ARTICLE ON AKKINENI


http://www.facebook.com/l/GAQEbh29h/www.apstarnews.com/?p=16306
SCRIPT OF ANR OBIT



AYYAPPA SONGS